Monday 20 March 2017

Rasam Recipe

Rasam Recipe
కావలసిన దినుసులు
1.                చింతపండు
2.                పంచదార
3.                జీలకర్ర పొడి
4.                నల్ల మిరియాల పొడి
5.                ఉప్పు
6.                కారం
7.                పసుపు
8.                టమాటాలు
9.                కొత్తిమీర
10.           పుదీన
11.           అల్లం
12.           వెల్లుల్లి
13.      జీలకర్ర
14.      ఆవాలు
15.      ఎండి మిర్చి
16.      వెల్లుల్లి
17.           కరివేపాకు
తయారుచేయు విధానం
1.          గిన్నెలో లీటరున్నర లీటర్ల నీళ్ళు పోసి స్టౌ మీద వేడిచేయాలి.
2.          మరుగుతున్న నీటిలో రెండు చెంచాలు పంచదార వేయాలి.
3.          కొత్తిమీర, పుదీన ఆకుల్ని కోసి, శుభ్రంగా కడిగి నీటిని వడగొట్టాలి.
4.          మరుగుతున్న నీటిలో కొత్తిమీర, పుదీన ఆకుల్నివేసి రెండు నిముషాల తరువాత స్ట్రైనర్ తో తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి.
5.          స్టౌ మీద మరుగుతున్న గిన్నెలో చింతపండు వేయాలి.
6.          రెండు టమాటాలను కడిగి ముక్కలుగా కోసుకోవాలి.
7.          పది వెల్లుల్ని రెబ్బల్ని తొక్క తీసివుంచాలి.
8.          రెండు అంగుళాల అల్లం ముక్కను కడిగి, తొక్కతీసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
9.          టామాటా, అల్లం, వెల్లుల్లి ముక్కలు,  బ్లాంచ్ చేసిన పుదీనా, కొత్తిమీర ఆకుల్ని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేయాలి.
10.      మొత్తం పేస్టును మరుగుతున్న చింతపండి నీటిలో వేసి కలయ తిప్పాలి.
11.      అందులో ధనియాపొడి, జీలకర్ర పోడి, నల్లమిరియాల పొడి చెరో చెంచాడు వేయాలి.
12.      పసుపు, కారం, ఉప్పు అభిరుచి మేరకు వేయాలి.
13.      మొత్తం మిశ్రమాన్ని క్లయ తిప్పి ఓ 30 నిముషాలు మరగనివ్వాలి.
14.      మొత్త మిశ్రమాన్ని స్ట్రైనర్ తో వడగట్టి వేరే గిన్నెలోనికి తీసుకోవాలి. స్ట్రైనర్ లో వచ్చిన పిప్పిని పడవేయాలి.
15.      జీలకర్ర, ఆవాలు, ఎండి మిర్చి, వెల్లుల్లి, కరివేపాకులతో ఆ మిశ్రమాన్ని తాలింపు వేయాలి.

16.       కొత్తిమీరను సన్నగా తరిగి గార్నిష్ చేయాసి సర్వ్ చేయాలి.